రొయ్య - ఎగ్ కర్రీ

Durga
ఎగ్స్ - 4 రొయ్యలు - 500 గ్రా   ఉల్లిపాయలు - 2 తరిగినవి టమోటాలు - 1 తరిగినవి చింతపండు - 2 నిమ్మకాయంతవి మెంతులు - 1 చిటికెడు పసుపు - 1 tస్పూన్  కారం ఉప్పు ముందుగ చింతపండు నుంచి చిక్కటి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండలి లో తగినంత నూనె పోసుకొని కాగాక తరిగిన ఉల్లిపాయలను, మెంతులను వేయించుకోవాలి.


వేగాక టమోటాలు, పసుపు ని వేసి వేయించుకోవాలి. వేగాక తగినంత కారం, ఉప్పు వేసి కలుపుకొని కడిగి పెట్టిన రొయ్యలని కలిపి 10 నిముషాలు వేయించుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని కూడా కలిపి ఉడకపెట్టాలి. నూనె తేలేంత వరకు ఉడకపెట్టాలి. తర్వాత ఉడికిన eggs ని వేసి కలిపి 10 నిముషాలు ఉడకపెట్టి దించేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: